ఖదీర్ రాసిన 'దర్గామిట్ట కథలు, 'పోలేరమ్మ బండ' నాకు చాలా ఇష్టమయిన పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలలోని కథల్లో ఖదీర్ తను, తన కుటుంబం, స్నేహితులు, బంధువులు, తను పుట్టి పెరిగిన ఊరయిన కావలి గురించి మనకి పరిచయం చేసారు. వీటిలో అంతర్లీనం గా బోల్డన్ని emotions , సెంటిమెంట్స్ దాగి వుంటాయి. అయితే ఏ కథ చదివినా సరదాగా నవ్వించేలాగానే వుంటుంది .
ఈ 'న్యూ బోంబే టైలర్స్' మాత్రం పైన చెప్పిన రెండు పుస్తకాలకి భిన్నంగా వుంటుంది.
'న్యూ బోంబే టైలర్స్' , 'పెండెం సోడా సెంటర్' కథలు కార్పోరేట్ కంపెనీ లు చిన్న చిన్న పట్టణాల్లోకి దూసుకుని వచ్చి అక్కడి లోకల్ వ్యాపారస్తులని ఎలా దెబ్బ తీస్తున్నాయో ఆ నేపధ్యం లో వుంటాయి. 'దావత్', 'జమీన్','కింద నేల వుంది','ఖాదర్ లేడు' ,'గెట్ పబ్లిష్డ్' మొదలయిన కథలు కూడా విభిన్న అంశాల నేపధ్యంలో వుంటాయి. కొన్ని కంట తడి పెట్టిస్తే, కొన్ని ఆలోచింపచేసేలా వుంటాయి. మొత్తానికి అన్ని కథలూ బాగున్నాయి. ఇవన్నీ కూడా magazines (ఎక్కువగా సండే ఆంధ్రజ్యోతి) లో వచ్చినవే. అయితే నేను అవేవీ చదవలేదు ఒక్క 'ఖాదర్ లేడు' తప్ప. ఇప్పుడు అన్నీ ఒకే పుస్తకం లోకి తీసుకొచ్చి మంచి పని చేసారు, నాలాంటి వాళ్ళు మిస్ కాకుండా.
పదేళ్ళ క్రితం ఖదీర్ తో నాకు పరిచయం వుండేది. చాలా సరదాగా ఉండేవాడు.అతను ఇంత సీరియస్ కథలు రాస్తాడని అప్పుడు ఊహించనేలేదు. అసలు నేను అతని కథలకి అభిమానినవుతానని అనుకోనేలేదు :)
yes itani books baguntayi...nee reference tho chadivi ..itani writings ki nenu fan ni ayipoya..ee book kuda na addlist lo pettesa...present itanu sakshi lo chestunnaru anukunta..
ReplyDeleteYeah, Sakshilo family page chesthuntaadata
Deletehmm... keerthi asalu nenu deggara ninchi ee books anni courier cheyinchukunte potundemo :).. tempting reviews.
ReplyDeleteAyyo..idi nenu aruvu tecchukunnadi..ammamma vaallintlo tavvakaallo bayatapadithe chadivesaa..asalu khadeer books okkati koodaa ledu naa daggara..peddiki isthaadu kadaa, nenu theesukuni chadavatame..but if u want, nenu theppisthaanu...not a problem..andaram chadivesaam
Delete