ఈ సినిమా చూడటమే ఒక వేస్ట్, ఇక దాని గురించి రాయటం పరమ దండగ. లాజిక్ లేని
కథ, నేల విడిచి సాము చేసే హీరో,అతని చుట్టూ తిరుగుతూ వెకిలి వేషాలేసే
హీరోయిన్ లు, రక్త పాతం, చీప్ కామెడీ, భారీ సెట్టింగ్స్ వెరసి ఈ సినిమా.
నాకు తెలుగు హీరోల పాట్లు చూస్తుంటే జాలేస్తుంది. నిజంగా వాళ్ళు ఇలాంటి
సినిమాలు ఇష్టపడే చేస్తున్నారా అనిపిస్తుంది. Jr NTR మంచి నటుడు దాంట్లో
తిరుగు లేదు. డాన్సులు, కామెడీ తో సహా నవరసాలు బాగా పండించగలడు. జనం అతన్ని
ఇలాంటి మాస్ రోల్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటివే చేయక
తప్పదు :( నా లాంటి సినిమా పిచ్చోళ్ళు వేరే గతి లేక చూడకా తప్పదు.
పండు గాడిని మాత్రం ఇక ఇలాంటి సినిమాలకి తీసుకేళ్ళకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడయితే వాడు theatre లోకి వెళ్ళగానే నిద్రపోతున్నాడు. కానీ కొంచెం ఊహ తెలిసాక చూడటం మొదలు పెడితే కష్టం కదా. అందుకే ముందు వాడిని తీసుకెళ్ళడం మానేసి మెల్లగా నేను కూడా ఇలాంటి సినిమాలకి వెళ్ళడం మానుకోవాలి.

No comments:
Post a Comment