Friday, March 1, 2013

గుల్జార్ కథలు - ధువా



గుల్జార్ పేరు వినగానే నాకు వెంటనే గుర్తొచ్చే రెండు పాటలు, మాచిస్ సినిమాలోని "చప్ప చప్ప చరఖా చలే" , మరోటి రుడాలి సినిమాలోని "దిల్ ఘం ఘం కరే " ఈయన గురించి ఇంకొంచెం తెలిసినదేంటంటే ఎన్నో మంచి సినిమాలకు కథ-కథనం-దర్శ కత్వం అందించి  భారత ప్రభుత్వం నుండి, మరెన్నో సంస్థల నుండి బోల్డన్ని అవార్డులు గెల్చుకున్నారనీను. కానీ బోల్డన్ని మంచి మంచి కథలు రాస్తారని ఈ పుస్తకం చూసే వరకూ తెలీదు. "ధువా" పేరిట కేంద్ర సాహిత్య అకాడమీ నుండి అవార్డులు అందుకున్న గుల్జార్ ఉర్దూ కథలను మృణాళిని గారు తెలుగులోకి తర్జుమా చేసి మనకి అందించారు.

ఇరవయి ఎనిమిది కథల ఈ సంకలనం లో గుల్జార్ గారి సినిమాల్లో (పాటల్లో ) వుండే సున్నితత్వం, సహజత్వం, భిన్నత్వం అన్నీ కనిపిస్తాయి. 1947 లో భారతదేశ విభజన సమయంలో కలిగిన కల్లోలం, సినీ దర్శకుడు బిమల్ రాయ్ గారితో గుల్జార్ అనుభవాలు, బడుగు జీవుల జీవన పోరాటం, ఆధునిక జీవన విధానం ఇలా ఒక్కో కథలో ఒక్కో సబ్జెక్టు వుంది. ఈ కథల్లో కొన్ని కల్పిత గాధలు కాగా మరి కొన్ని రచయిత జీవితంలో జరిగిన సంఘటనల నేపధ్యంలో రాయబడినవి. మూడు కథలు మినహా మిగిలినవన్నీ మూడు-నాలుగు పేజీ ల కథలే.

 నేనింత వరకూ చదివిన పుస్తకాల్లో (కథా సంకలనాలు) ఇన్ని వైవిధ్యమయిన కథలు ఒకే చోట వుండటం గమనించలేదు. ఇక మృణాళిని గారి అనువాదం గురించి చెప్పనే అక్కర్లేదు. చాలా సరళంగా వుంది.

No comments:

Post a Comment