Tuesday, January 31, 2012

అగ్నిపధ్


అమితాబ్ బచ్చన్ నటించిన పాత అగ్నిపధ్ సినిమా నేను చూడలేదు. కనుక ఈ సినిమాకి నేను ఎలాంటి expectations తో వెళ్ళలేదు. కేవలం హ్రితిక్ రోషన్ కోసం ఈ సినిమా చూడాలనుకున్నాను.సినిమా average గా అనిపించింది. 1990 లో వచ్చిన సినిమా లో కథలాగానే అనిపించింది.హీరో చిన్నతనంలో తండ్రి ని పోగొట్టుకోడం, తల్లితో దూరంగా వెళ్ళడం, తండ్రి చావుకి కారణమయిన వాడి మీద పగ పెంచుకోడం, ఈ నేపధ్యంలో తల్లికి దూరం కావడం, చెల్లెలి సెంటిమెంట్ ఇవంతా అప్పటి సినిమాల్లో ఉన్నదే. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఈ పాత కథకి కొత్త ప్రాణం పోశాయి.

ముఖ్యంగా సంజయ్ దత్ నటన, ఆహార్యం చాలా ఆకట్టుకున్నాయి. ఇప్పటి సినిమాల్లో విలన్ అంటే హీరో కంటే స్టైల్ గా, అందంగా ఉంటున్నాడు . ఇందులో మాత్రం విలన్ భయంకరంగా వున్నాడు. భీభత్సంగా నటించేసాడు. పండు గాడయితే స్క్రీన్ మీద సంజయ్ దత్ ని చూడగానే అమ్మ బూచి అని చెప్పి నా వేపు తిరిగి పడుకుండిపోయాడు. ఇక హీరో హ్రితిక్ కూడా చాలా బాగున్నాడు ఎప్పటిలాగానే. హీరో మనసులో దాగి ఉన్న బాధ, కసి, కోపం, తపన అన్నీ అతని కళ్ళలో ప్రతిఫలిస్తాయి. కేవలం కళ్ళతోనే నా లాంటి ప్రేక్షకులకి మంత్రం వేసేసాడు :D రిషి కపూర్ గుండు లా వున్నాడు కానీ అతని పోర్షన్ కూడా బాగుంది. ప్రియాంక చోప్రా పర్లేదు. ఇక ఐటెం సాంగ్ నాకేం నచ్చలేదు. దీనికంటే 'తీస్ మార్ ఖాన్' లో 'షీలా కీ జవాని' చాలా బెటర్ అనిపించింది. అయితే పాటలో కత్రినా మాత్రం బాగుంది.

సినిమా మొదటి 20 నిమిషాలు నాకు చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం నిడివి ఎక్కువయినట్టనిపించింది. సినిమాలో ముఖ్యమయిన పాత్రలన్నీ చనిపోవడం కొంచెం కష్టంగా తోచింది నాకు :( మొత్తానికి ఒక సారి చూసెయ్యొచ్చు.

No comments:

Post a Comment