ప్రేమ ని గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా నిర్వచించారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ప్రేమ కి ఇదే సరయిన అర్ధం అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. మన సమాజం లో ఎన్నో రకాల ప్రేమలు ఆమోదించబడతాయి కానీ వేరు వేరుగా పెళ్ళయిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అంటే మాత్రం అందరూ నిరసిస్తారు. స్త్రీ-పురుషుల మధ్య ఏర్పడే ప్రేమలో శారీరక సంబంధానికి చోటు వుండే అవకాశం వలననేమో ఇలాంటి ప్రేమలు ఎవరూ ఒప్పుకోరు. పెళ్ళయిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్నేహంగా మొదలయిన పరిచయం క్రమంగా పెరిగి ప్రేమగా మారి ఇద్దరి కుటుంబాలను, జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో, వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా వుంటుందో అనేదే ఈ కథాంశం.
ఈ కథ అంతా అమెరికా లో రెండు తెలుగు కుటుంబాల మధ్య జరుగుతుంది. కల్హార-చైతన్య దంపతులకు ముద్దులొలికే పాప మేఘన. కౌశిక్-మృదుల దంపతులకు తుషార్ అనే ఏడేళ్ళ బాబు ఉంటాడు. రెండు కుటుంబాలు టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ పట్టణంలో వుంటాయి. రెండు జంటలూ ఇండియాలో మధ్య తరగతి కుటుంబాలకి చెందిన వారు. ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ప్రశాంతమయిన జీవితం గడుపుతుంటారు.ఎవరికీ భాగస్వాముల మీద ఎలాంటి కంప్లైంట్స్ వుండవు (చిన్న చిన్న గొడవలు తప్ప). ఒక ప్రయాణంలో కల్హార-కౌశిక్ మధ్య పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోనే ఒకరికి ఒకరు నచ్చుతారు. మొదట స్నేహితులుగా వుందామనుకున్న వారిద్దరూ క్రమేణా ఒకరిని విడిచి ఒకరు వుండలేనంతగా దగ్గరవుతారు. అయితే తమ ప్రేమ కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వదులుకోవాలన్న ఆలోచన వుండదు. వీళ్ళ ప్రేమ విషయం తెల్సిన చైతన్య, మృదుల లు ఎలా స్పందించారు, చివరికి కల్హార-కౌశిక్ ల మధ్య ప్రేమ ఎలా నిలిచిందీ, ఈ క్రమం లో నలుగురూ పడిన మానసిక సంఘర్షణ ని రచయిత్రి ఎంతో హృద్యంగా వర్ణించారు.
ఈ నవల చదివాక ప్రతి పెళ్ళయిన వ్యక్తి ఇందులో వున్న ముఖ్య పాత్రలలో ఏదో ఒక దానిలో తమని తాము identify చేసుకోగలరు. ఇందులో కథ కంటే కూడా పాత్రధారుల మానసిక సంఘర్షణ ను ఎక్కువ హైలైట్ చేసారు. కొన్ని వాఖ్యాలయితే నాకు చాలా చాలా నచ్చాయి,
అశాంతికి కారణం అసంతృప్తి
మనసు మాట వినేవారికి ఉన్నంత నరకం మరోటి వుండదు (ఈ మాట నాకు సరిగ్గా గుర్తు రాట్లేదు. పుస్తకం ఏమో ప్రస్తుతం నా దగ్గర లేదు)
స్నేహం, ప్రేమ అందరి పట్ల ఒకేలా వుండదు. ఒకరి దగ్గర ప్రవర్తించినట్టు, ఫీల్ అయినట్టు మరొకరి దగ్గర ఫీల్ అవలేము, ప్రతి స్నేహం, ప్రేమ వేటికవే విభిన్నం.
ఒక పని చేయాలని తీవ్రంగా అనిపించినప్పుడు ఆ పని చెయ్యడం తప్పు కాదు అని మనసు మనకి అనుకూలంగా నచ్చ చెప్తుంది. అది గుర్తించకపోతే మనసు వేసే ట్రాప్ లో చిక్కుకోక తప్పదు.
ఇంకా ఇలాంటివెన్నో వున్నాయి పుస్తకం నిండా. మొదట సాధారణంగా మొదలయిన కథ లోతుకి వెళ్ళే కొద్దీ పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళెదుట నిలిచాయనిపిస్తుంది. ఆ ప్రాత్రల సంఘర్షణలో మన మనసూ, మెదడూ కూడా ఒక భాగమయిపోతాయి. కథాంశం విన్న తర్వాత ఇది అక్రమ సంబంధాలను ప్రోత్సహించేదిగా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ చదివే కొద్దీ తమకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఇద్దరు బాధ్యాతాయుతమయిన వ్యక్తుల మానసిక స్థితి కి ఇది సజీవ రూపంగా నిలుస్తుంది. మ్యారేజ్ counselling బుక్ లా అనిపించింది నాకయితే.
ఇంత మంచి నవలను అందించిన కల్పన గారికి అభినందనలు.
Image source : Saaranga books
Same story Karan Johar movie laaga teesadu Kabhi Alvida Naa Kehana ani. Shahrukh and Priety Zinta oka couple, Abhishek and Rani Mukherjee inko couple. Shahrukh and Rani will fall in love with each other. movie choosinappudu matram assalu digest chesukolekapoyanu.. iddarivi love marriages laane choopisthadu and loving gaane untaru Priety and Abhishek valla respective spouses thoti... nee review chadivaka book chadavalani interest kalugutondi.
ReplyDeleteYeah, aa movie nenu choosanu Chaitali...ayithe andulo Shahrukh and Rani iddaroo konchem asamthrupthigaa vuntaaru vaalla married life patla..spouses tho istamgaa vundatam veru, happygaa vundatam veru kadaa...ee novel lo alaantidemee vundadu...iddarikee elaanti complaints vundavu spouses tho...ayithe okaritho okaru premalo paddaaka vaalla valla spouses tho compare chesukodam start chesthaaru...
DeleteChaduvu veelayithe, baagundi
Interesting... I'll try this sometime.
ReplyDelete