Showing posts with label short stories. Show all posts
Showing posts with label short stories. Show all posts
Friday, March 1, 2013
గుల్జార్ కథలు - ధువా
గుల్జార్ పేరు వినగానే నాకు వెంటనే గుర్తొచ్చే రెండు పాటలు, మాచిస్ సినిమాలోని "చప్ప చప్ప చరఖా చలే" , మరోటి రుడాలి సినిమాలోని "దిల్ ఘం ఘం కరే " ఈయన గురించి ఇంకొంచెం తెలిసినదేంటంటే ఎన్నో మంచి సినిమాలకు కథ-కథనం-దర్శ కత్వం అందించి భారత ప్రభుత్వం నుండి, మరెన్నో సంస్థల నుండి బోల్డన్ని అవార్డులు గెల్చుకున్నారనీను. కానీ బోల్డన్ని మంచి మంచి కథలు రాస్తారని ఈ పుస్తకం చూసే వరకూ తెలీదు. "ధువా" పేరిట కేంద్ర సాహిత్య అకాడమీ నుండి అవార్డులు అందుకున్న గుల్జార్ ఉర్దూ కథలను మృణాళిని గారు తెలుగులోకి తర్జుమా చేసి మనకి అందించారు.
ఇరవయి ఎనిమిది కథల ఈ సంకలనం లో గుల్జార్ గారి సినిమాల్లో (పాటల్లో ) వుండే సున్నితత్వం, సహజత్వం, భిన్నత్వం అన్నీ కనిపిస్తాయి. 1947 లో భారతదేశ విభజన సమయంలో కలిగిన కల్లోలం, సినీ దర్శకుడు బిమల్ రాయ్ గారితో గుల్జార్ అనుభవాలు, బడుగు జీవుల జీవన పోరాటం, ఆధునిక జీవన విధానం ఇలా ఒక్కో కథలో ఒక్కో సబ్జెక్టు వుంది. ఈ కథల్లో కొన్ని కల్పిత గాధలు కాగా మరి కొన్ని రచయిత జీవితంలో జరిగిన సంఘటనల నేపధ్యంలో రాయబడినవి. మూడు కథలు మినహా మిగిలినవన్నీ మూడు-నాలుగు పేజీ ల కథలే.
నేనింత వరకూ చదివిన పుస్తకాల్లో (కథా సంకలనాలు) ఇన్ని వైవిధ్యమయిన కథలు ఒకే చోట వుండటం గమనించలేదు. ఇక మృణాళిని గారి అనువాదం గురించి చెప్పనే అక్కర్లేదు. చాలా సరళంగా వుంది.
Friday, August 3, 2012
మెట్ల మీద - మిడ్కో కథలు
విప్లవ రచయితల సంఘం (విరసం) వారు ప్రచురించిన ఈ పుస్తకం లో మిడ్కో రాసిన పద్దెనిమిది కథలు వున్నాయి. ఇందులో మొదటి పది కథల్లో మధ్య తరగతి స్త్రీ-పురుష సంబంధాల గురించిన విశ్లేషణ వుంటుంది. అన్ని కథలూ
స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల చుట్టూ తిరుగుతాయి. రచయిత ఒక స్త్రీ అవడం మూలాన అనుకుంటా అన్ని కథల్లోనూ స్త్రీ పాత్ర పరంగా కథ చెప్పబడుతుంది.
తర్వాత వచ్చే ఎనిమిది కథలు మాత్రం నేను ఇంతవరకూ చదవని అంశం గురించి వున్నాయి. నక్సల్స్ ఉద్యమ నేపధ్యం లో తెలంగాణా ప్రాంతం లోని స్త్రీల కష్టాలు, కన్నీళ్లు, వేదన, పట్టుదల, పోరాటం గురించి రాసారు. చివరి కథ అయిన "మెట్ల మీద" మాత్రం కథా నాయకుడి కోణం లోనుండి చెప్పబడింది. ఉద్యమం లో నుండి బయటకి వచ్చేసాక అతని చుట్టూ ఉన్న సమాజం లో జరిగిన మార్పులకు, కుటుంబ సభ్యుల, స్నేహితుల దృక్కోణం లో మార్పులకు, వారి దృష్టిలో తన స్థానం గురించిన సంఘర్షణ నేపధ్యం లో వుంటుందీ కథ. ఈ ఎనిమిది కథలూ తెలంగాణా మాండలికం లో వున్నాయి.
మొత్తానికి అన్ని కథలూ బావున్నాయి. మిడ్కో అంటే గోండు (ఒక ఆదివాసీ తెగ) బాషలో మిణుగురు పురుగు అట :)
Saturday, April 28, 2012
బెంగాలి నవలలు, కథలు - 1
దేవదాసు - శరత్ - ఈ కథ అందరికీ తెలిసిందే. పాతదో, కొత్తదో 'దేవదాసు' సినిమా చూడని వాళ్ళు వుండరేమో. అయితే ఈ సినిమా కి మూలమయిన నవల ఎలా వుంటుందో చదవాలన్న కోరిక నాకెప్పటి నుండో ఉండింది. నవల చదువుతున్నంత సేపు ఈ మధ్యే చూసిన హిందీ 'దేవదాసు' గుర్తొస్తూనే వుంది. సినిమాకి, నవల కి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పటి తరం వాళ్లకి ఆనాటి రచన చదవడం కంటే సినిమా చూస్తేనే నచ్చుతుందేమో. శరత్ రచనా శైలి మాత్రం చదివింపచేసేలా వుంది.
మజిలీ దీదీ - శరత్ - ఇందులో మూడు కథలున్నాయి, మజిలి దీదీ, అణిగిన అహంకారం, కారుచీకటిలో కాంతిరేఖ - మొదటి కథ మజిలి దీదీ నచ్చింది నాకు. తల్లిని తండ్రిని పోగొట్టుకుని అనాధ అయిన కేప్టో సవతి సోదరి అయిన కాదంబిని పంచన చేరతాడు. వారి నిరాదరణకు గురి అయిన కేప్టో ని పక్కనే ఉంటున్న కాదంబిని తోడికోడలయిన హేమాంగిని అక్కున చేర్చుకుంటుంది. ఇది కిట్టని కాదంబిని హేమాంగి తో గొడవకి దిగడం తో రెండు కుటుంబాల మధ్య అంతకు ముందు నుండి వున్న మనస్పర్ధలు హెచ్చుతాయి. చివరకు హేమాంగిని ఇల్లు వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయినా సరే తను నమ్మిన దారిలో నడవడం కోసం భర్తని ఎదిరించి పోరాడి చివరకు కేప్టో ని ఆదరించేందుకు భర్త ని ఒప్పిస్తుంది. ఇక మిగతా రెండు కథలు పెద్దగా నచ్చలేదు. ఈ కథలన్నిటి లోనూ ఆనాటి బెంగాల్ రాష్ట్రం లోని జమిందారి పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతి కళ్ళకు కట్టినట్టు వర్ణించారు రచయిత.
విష వృక్షం - బంకించంద్ర చటర్జీ - 'వందేమాతరం' రాసిన బంకింబాబు కలం నుండి జారువాలిన నవల ఇది. కుంద అనే ఒక అందమయిన యువతి జీవితం గురించిన కథ ఇది. అనాధ అయిన ఆమెను నాగేంద్రుడు (ఒక జమిందారు) చేరదీస్తాడు. మొదట్లో ఆమె పట్ల కేవలం జాలితో వ్యవహరించిన అతను కొద్ది రోజులకి ఆమెని ప్రేమించడం (ప్రేమించానని అనుకోవడం) మొదలు పెడతాడు. విషయం తెల్సిన అతని భార్య సూర్యముఖి పెద్ద మనసు తో ఇద్దరికీ పెళ్లి జరిపిస్తుంది. తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కానీ కొద్ది రోజులకే నాగేంద్రుడు తనకు కుంద మీద వున్నది ప్రేమ కాదు అన్న విషయం గుర్తించి భార్య ని వెతుకుతూ తనూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. చివరికి భార్య భర్తలు కలుస్తారు కానీ కుంద ఒంటరి అయిపోతుంది. తర్వాత ఆమె ఏమయింది అనేది ముగింపు. ఈ కథ నాకేమీ నచ్చలేదు.
మొత్తానికి నేను చదివిన మూడు పుస్తకాలు నన్ను కొంచెం నిరాశ పరిచాయనే చెప్పాలి. చాలా దశాబ్దాల క్రితం నాటి రచనలు కాబట్టి నా బుర్ర కి సరిగ్గా ఎక్కలేదేమో మరి. అయినా సరే, ఇంకో మూడు పుస్తకాలున్నాయి (శరత్, బంకింబాబు వి)..అవి కూడా చదివేస్తాను.
జతగాళ్ళు-కతగాళ్ళు - మునిరాజు, సురేష్ రెడ్డి
స్నేహితులయిన ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి ఒకరు చెప్పుకునే కథల సమాహారమే ఈ పుస్తకం. చిన్నప్పుడు బామ్మ, తాతయ్య చెప్పే నీతి కథల్లాంటి కథలున్నాయి ఈ పుస్తకంలో. చాలా కాలం క్రితం చదివిన చందమామ, బాలమిత్ర కథలు జ్ఞాపకం వచ్చాయి ఇవి చదువుతుంటే. చదవడానికి పిల్లలకి చెప్పే బెడ్ టైం స్టోరీస్ లాగా అనిపించినా వీటిలో వున్న నీతి గురించి తెల్సుకోవడం అందరికీ అవసరమే.
చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు - అమరనారా బసవరాజు (హోసూరు కథలు)
ఎటువంటి కల్పనా లేని వాస్తవిక కథలు ఇవి. రచయిత తనకు ఎదురయిన అనుభవాలు, పల్లెలోని వాతావరణం, ప్రకృతి, అక్కడి మనుషుల నమ్మకాలు వీటి గురించి తనదయిన భాషలో వర్ణిస్తారు. ఈ కథలలో హోసూరు (కర్ణాటక) ప్రాంతం లో ని సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి జీవిత చిత్రాలు అన్నీ ఇమిడి వున్నాయి. వివిధ ప్రాంతాల నేపధ్యాలలో రాయబడిన కథలు ఇష్టపడే వారికి ఈ కథలు బాగా నచ్చుతాయి.
మిథునం - శ్రీ రమణ
శ్రీ రమణ గారు రాసిన ఎనిమిది కథల సంపుటి ఈ పుస్తకం. సున్నితమయిన వ్యంగ్యం, గిలిగింతలుపెట్టే హాస్యం, చక్కని శైలి తో ఇందులోని కథలన్నీ ఆకట్టుకుంటాయి.
ఇందులోని మొదటి కథ 'అరటిపువ్వు సాములారు' నాకు అంతగా నచ్చలేదు, మొత్తం కథల్లో నాకు అంతగా నచ్చని కథల్లో ఇది ఒకటి, మరోటి 'పెళ్లి' అనే కథ. ఈ కథంతా ఒక పెళ్లి లో జరిగే సంభాషణల చుట్టూ తిరుగుతుంది. బోల్డన్ని అంశాల చుట్టూ తిరిగే ఈ సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి.
నచ్చని కథలను వదిలేసి నచ్చిన కథల్లోకి వచ్చేస్తా,
తేనెలో చీమ - కథానాయకుడి జీవితంలోని విషాదానికి కొంచెం వ్యంగ్యం జోడించి రాసిన కథ. పేరు అతికినట్టుగా సరిపోయింది :)
వరహాల బావి - ఒక ఊరిలో వరహాలమ్మ అనే పెద్దావిడ ఇల్లున్న చోట తవ్విన బావి ఊరందరికీ ఎలా దారి చూపిందో, అదే బావి ఊర్లో గొడవలకు ఎలా దారి తీసిందో చాలా చక్కగా వర్ణించిన కథ.
ధనలక్ష్మి - భార్య-భర్తల మధ్య వచ్చే 'ఇగో' సమస్య గురించిన కథ. ధనలక్ష్మి తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేము.
షోడా నాయుడు - షోడా గోలి కోసం షోడా అమ్మే నాయుడి చుట్టూ తిరుగుతూ కథకుడు పడే పాట్లతో నవ్వు తెప్పిస్తూనే గడచిపోయిన మన బాల్యాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది ఈ కథ.
బంగారు మురుగు - ఇది నా alltime ఫేవరెట్ కథ. వేరే కథా సంపుటాల్లో ఈ కథ చదివేసాను. కానీ ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.వెనకటి తరం లోని కుటుంబ వాతావరణం, బామ్మ-మనుమడి అనుబంధం, బామ్మ గారి లౌక్యం, గుణం అన్నీ మనల్ని కట్టిపడేస్తాయి.
మిథునం - ఇది భార్యా-భర్తల మధ్య జరిగే కథ. ప్రతి ఇంట్లోనూ ప్రతి నిత్యం సాగే సరదా గొడవలు, వాటితోనే ఇద్దరి సహజీవనం గురించి ఎంతో చక్కగా వర్ణించారు. ఇందులో తాతగారికి తిండి యావ ఎక్కువ. నాకయితే కథ చదువుతున్నంత సేపు నోట్లో నీళ్లూరుతూనే వున్నాయి ఆ పాత కాలం నాటి వంటలు, అవి వండే విధానం చదువుతూ వుంటే.
పుస్తకం మొత్తం చదివేసాక కమ్మటి తెలుగింటి భోజనం చేసినట్టనిపించింది నాకు :)
Friday, April 20, 2012
న్యూ బోంబే టైలర్స్ - ఖదీర్ బాబు
ఖదీర్ రాసిన 'దర్గామిట్ట కథలు, 'పోలేరమ్మ బండ' నాకు చాలా ఇష్టమయిన పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలలోని కథల్లో ఖదీర్ తను, తన కుటుంబం, స్నేహితులు, బంధువులు, తను పుట్టి పెరిగిన ఊరయిన కావలి గురించి మనకి పరిచయం చేసారు. వీటిలో అంతర్లీనం గా బోల్డన్ని emotions , సెంటిమెంట్స్ దాగి వుంటాయి. అయితే ఏ కథ చదివినా సరదాగా నవ్వించేలాగానే వుంటుంది .
ఈ 'న్యూ బోంబే టైలర్స్' మాత్రం పైన చెప్పిన రెండు పుస్తకాలకి భిన్నంగా వుంటుంది.
'న్యూ బోంబే టైలర్స్' , 'పెండెం సోడా సెంటర్' కథలు కార్పోరేట్ కంపెనీ లు చిన్న చిన్న పట్టణాల్లోకి దూసుకుని వచ్చి అక్కడి లోకల్ వ్యాపారస్తులని ఎలా దెబ్బ తీస్తున్నాయో ఆ నేపధ్యం లో వుంటాయి. 'దావత్', 'జమీన్','కింద నేల వుంది','ఖాదర్ లేడు' ,'గెట్ పబ్లిష్డ్' మొదలయిన కథలు కూడా విభిన్న అంశాల నేపధ్యంలో వుంటాయి. కొన్ని కంట తడి పెట్టిస్తే, కొన్ని ఆలోచింపచేసేలా వుంటాయి. మొత్తానికి అన్ని కథలూ బాగున్నాయి. ఇవన్నీ కూడా magazines (ఎక్కువగా సండే ఆంధ్రజ్యోతి) లో వచ్చినవే. అయితే నేను అవేవీ చదవలేదు ఒక్క 'ఖాదర్ లేడు' తప్ప. ఇప్పుడు అన్నీ ఒకే పుస్తకం లోకి తీసుకొచ్చి మంచి పని చేసారు, నాలాంటి వాళ్ళు మిస్ కాకుండా.
పదేళ్ళ క్రితం ఖదీర్ తో నాకు పరిచయం వుండేది. చాలా సరదాగా ఉండేవాడు.అతను ఇంత సీరియస్ కథలు రాస్తాడని అప్పుడు ఊహించనేలేదు. అసలు నేను అతని కథలకి అభిమానినవుతానని అనుకోనేలేదు :)
Monday, February 20, 2012
వేలుపిళ్లై - సి.రామచంద్రరావు
నేను ఈ పుస్తకం చదవాలనుకోవడానికి కారణం దీనికి ముళ్ళపూడి వెంకటరమణ గారు, నండూరి రామమోహనరావు గారు రాసిన పరిచయ వాఖ్యలు :) గడిచిన కాలం లో ఈ రచయత రాసినవి ఈ తొమ్మిది కథలే అయినా టాప్ టెన్ రచయతల్లో రామచంద్రరావు గారిని ఒకరిగా చాసో గారు వర్ణించారు అంటే తప్పకుండా ఇవి బాగుండి వుంటాయి అని చదవడం మొదలుపెట్టాను. ఇందులోని కథలన్నీ అరవై-డెబ్బై ఏళ్ళ క్రిందట రాసినవి.రచయిత అప్పట్లో కర్నాటక/తమిళనాడు లోని ఒక టీ-ఎస్టేట్ లో ఉన్నతాధికారిగా పని చేసారు, మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా.
ఈ సంపుటి లో తొమ్మిది కథలున్నాయి. అన్నిటిలో ఏది నచ్చింది అని అడిగితే చెప్పడం కష్టమే. వేటికవే ప్రత్యేకమయినవిగా తోచాయి. ఎక్కువ కథలకు నేపధ్యం టీ-ఎస్టేట్ లోని జీవితమే. స్త్రీ-పురుషల సంబంధాలు, భార్య-భర్తల అనుబంధాలు, యజమాని-నౌకరు సంబంధాలు, సహోద్యోగుల మధ్య వుండే వాతావరణం, మనిషికి-జంతువుకి మధ్య వుండే సున్నితమయిన సెంటిమెంట్స్ ఇలా మానవ సంబంధాలలో వున్న అనేకానేక కోణాలను స్పృశిస్తూ రాసిన కథలు ఇవన్నీను. ఒక్కో కథ రాయడం కోసం రచయిత చేసిన పరిశీలన మెచ్చుకోదగినది. ముఖ్యంగా 'ఏనుగులరాయి' కథలో ఏనుగుల మనస్తత్వాన్నీ, కడకరైకీ-ఏనుగులకీ మధ్య వుండే అనుబంధాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఎంతో పరిశీలనా దృష్టి వుంటే కానీ ఇది సాధ్యపడదు. కథల్లోని పాత్రలన్నీ సజీవంగా, వాస్తవికంగా వున్నాయి.
ఈ కథల్లోని పాత్రదారులు ఎక్కువ మంది తమిళ తంబిలు, ఇంకా తెల్ల దొరలూ. అయినా స్వచ్ఛమయిన తెలుగు కథలు చదువుతున్నట్టే అనిపించింది. తెలుగు కథ రాయడానికి ప్రాత్రధారులు, నేపధ్య వాతావరణం తెలుగు మాత్రమే కానవసరం లేదు అని అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. పడమటి కనుమల మధ్య, పచ్చటి టీ-కాఫీ తోటల్లో విహరిస్తూ స్వచ్ఛమయిన గాలి పీలుస్తూ మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ వచ్చింది ఈ కథలు చదువుతుంటే.
Friday, February 17, 2012
ఒక హిజ్రా కథ - పరవస్తు లోకేశ్వర్
ఉర్దూ, హిందీ భాషలలోని 8 కథలను పరవస్తు లోకేశ్వర్ గారు అనువదించి ఈ పుస్తక రూపం లో అందించారు. ఇందులో మూడు కథలు కుష్వంత్ సింగ్ రాసినవి కాగా మిగతా అయిదూ వేరు వేరు రచయితలు రాసినవి. కుష్వంత్ సింగ్ రాసిన మూడు కథలూ 17 - 18 శతాబ్దాలలో మొఘల్ సామ్రాజ్యం మరియూ సిపాయి తిరుగుబాటు ల నేపధ్యాలలో రాసినవి. చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కేవలం చరిత్ర పుస్తకాలు చదివితే సరిపోదు. ఎందుకంటే అందులో రాజులు, వాళ్ళ పాలనా విధానాలు, జరిగిన యుద్ధాలు, ఆస్తుల లెక్కలు, రాజకీయ ఒప్పందాలు, తారీఖులు ఇవి మాత్రమే వుంటాయి. అప్పటి కాలంలో ప్రజల మనోభావాలు, సంఘర్షణలు కూడా చరిత్రలో భాగమే. ఇవి దాదాపుగా ఏ చరిత్ర పుస్తకంలోనూ కనిపించవు. ఇవి తెల్సుకోవాలంటే అప్పటి కాలం లో జీవించిన సామాన్యుల కథలు చదవాలి. ఈ మూడు కథల లోనూ అప్పటి ప్రజల జీవన విధానాలు, ఆలోచనలు, యుద్ధాల వలన వాళ్ళ జీవితాల్లో వచ్చిన పెను మార్పులూ అన్నీ చక్కగా వర్ణించబడ్డాయి.
ఇక మిగతా కథలలో నాకు మొదటి కథ 'గృహ నిర్మాత' , రెండవ కథ ' పరువు-ప్రతిష్ట' బాగా నచ్చాయి. మొదటి కథలో వేశ్య అయిన లాజ్వంతి వివాహం ద్వారా స్వేచ్ఛను కోల్పోతే (సమాజం లో ఒక గౌరవమయిన స్థానం పొందినప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతుంది), రెండవ కథలో పటాన్ల అమ్మాయి స్వేచ్ఛగా జీవించగలిగి ఉండి కూడా మనసిచ్చిన వాడి కోసం, కుటుంబ పరువు కోసం వివాహం మాట తలపెట్టకుండా తనకు తానే సంకెళ్ళు వేసుకుని జీవితమంతా గడిపేస్తుంది. విభిన్న పరిస్థితులలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ సంఘర్షణకి ఈ రెండు కథలూ అద్దం పడతాయి. ఇక అనుకోని పరిస్థితులలో హిజ్రాగా మారిన మైనా కథ కంట తడి పెట్టిస్తుంది.
భాష కూడా సరళంగా ఉండి చదవడానికి తేలికగానే ఉంది.
Thursday, January 19, 2012
Mittoorodi Pusthakam – Naamini Subramanyam Naidu
Naamini – Writer of the Masses…this’s how I feel when I read his books…I’ve read this mittoorodi pusthakam long back, but missed to post the review here…Recently re-read it and hence thought of posting..
This book is a collection of 6 of Naamini’s books published earlier,
Pacchanaaku Saakshiga – I guess this one is the writer’s first work…This’s a collection of short stories narrating his childhood spent in a remote village in Chittoor dt. He belongs to a very poor peasant family. I loved the character of his mother Sinakka.She is an Icon of present day rural women…Hardworking, courageous and also helplessly cunning at times to feed her children.
Sinabba Kathalu – This one again is a collection of short stories…All the stories revolve around his high school life, friends and teachers.
Mittoorodi Kathalu – This is also a collection of stories written after his marriage. So most of them revolve around the couple, their fights, family issues etc
Munikannadi Sedyam – This is a short novel which reminded me of Chandralatha’s ‘Regadi Vitthulu’ (my all time favourite novel based on agricultural revolution). Farming issues in rural areas of Chittoor dt, problems faced by lease farmers(koulu raithulu) etc are narrated in a heart-touching manner.
Pala podugu – This is a short novel describing the life of a very poor family who earns livelihood by selling milk.
Sundaramma kodukulu – This is also a short novel depicting the joint family issues in a poor peasant family, their struggle for existence, fights among the co-sisters and all.
All in all, this total book describes the life style of rural Chittoor dt. Written in the most raw slang of rayalaseema area (including some naatu pacchi boothulu

Gadi Lopali Goda – Palamaneru Balaji
A collection of 19 short stories. The author chose a wide variety of
topics like farmers’ suicides, corporate education system, problems
related to women and many other issues as subjects to these stories.
Each story is unique, most of them reflect our day to day lives and we
can identify ourselves in few characters. Loved all of them.
Simple, yet thought provoking.
Simple, yet thought provoking.
My most loved stories from around the world – Apple books
This’s a collection of famous folk tales from China, Africa, Norway
and few other countires. Reading a folk tale had always been a pleasure
to me ‘coz through these stories we get an insight into the culture and
traditions of the society from which they originated.
Simple, short and sweet tales. They take you away to strange and distant lands. Recommended for bedtime story telling to kids
Simple, short and sweet tales. They take you away to strange and distant lands. Recommended for bedtime story telling to kids

Gattu thegina cheruvu – Aari Seetharamayya
Collection of 14 short stories. Most of the stories are based on NRI
lives. One story which I liked the most is ‘Avachaaram’ – a grandmom’s
struggle to say no to babystitting responsibilities. Heart-touching one.
Rest others are just average. I’ve read so many stories based on the
same concepts, nothing new.
The book I got has a misprint. So I missed some connections in few stories.
The book I got has a misprint. So I missed some connections in few stories.
Nirnayaaniki atoo itoo – Indraganti Janaki Bala
This book is a collection of 26 short stories written by
Mrs.Indraganti Janaki Bala (Film director Indraganti Mohana Krishna’s
mom). Most of the stories focus on various aspects like dowry, family
relations, independence, domination etc concerning women in middle class
families of our generation. Each story is unique and is a master piece.
I cannot select one or two favourites among these. Liked all the
stories. Simple, yet thought provoking.
Few years back I’ve read an award winning novel ‘Kanipinche gatham’ written by the same author. It’s one of my favourites.
Few years back I’ve read an award winning novel ‘Kanipinche gatham’ written by the same author. It’s one of my favourites.
Mafia Queens of Mumbai – S.Hussain Zaidi with Jane Borges
Mafia Queens of Mumbai is a collection of stories of 13 different
women who played an important role in the Mumbai underworld. These
stories are pieced from information gathered from family, aquaintances
of those women and also through some official documents and reports.
It begins with the story of Jenabai Daaruwaali, a freedom-fighter who laters turns to illegal grain trade to feed her 6 young children after her husband abandons the family. She then enters into liquor business and gets into contact with underworld dons Haaji Mastan, Kareem Laala etc. She was treated with high respect both by the underworld and the police department.
Then comes the story of Gangubhai from Kamathipura who gets into prostitution much aganist her will. She turns out to be a winner here and tries to protect the rights of sex workers.
The third and the most interesting story is about Sapna Didi aka Ashraf Khan. She’s the widow of an underworld man Mehmood who gets killed in an encounter planned by Daawood Ibrahim. She decides to take revenge on Daawood unaware of how dangerous person she’s after. She’s brutally killed by Daawood’s men and her mission remains unaccomplished.
Then there are stories of Narco queens Jyothi and Mahalaxmi Papamani, Abu Salem’s lover Monica Bedi and few other women who directly or indirectly are linked with Mafia.
The first 3 stories and Monica Bedi’s episode are very well written while the other stories are too short.All these stories are real and reveal a totally different side of Mumbai’s underworld. An interesting read, I would say.
Eppudoo chadive, choose maga goondaala gurinchi kaakundaa aada goondaala gurinchi thelsukodam chaalaa baagundi
It begins with the story of Jenabai Daaruwaali, a freedom-fighter who laters turns to illegal grain trade to feed her 6 young children after her husband abandons the family. She then enters into liquor business and gets into contact with underworld dons Haaji Mastan, Kareem Laala etc. She was treated with high respect both by the underworld and the police department.
Then comes the story of Gangubhai from Kamathipura who gets into prostitution much aganist her will. She turns out to be a winner here and tries to protect the rights of sex workers.
The third and the most interesting story is about Sapna Didi aka Ashraf Khan. She’s the widow of an underworld man Mehmood who gets killed in an encounter planned by Daawood Ibrahim. She decides to take revenge on Daawood unaware of how dangerous person she’s after. She’s brutally killed by Daawood’s men and her mission remains unaccomplished.
Then there are stories of Narco queens Jyothi and Mahalaxmi Papamani, Abu Salem’s lover Monica Bedi and few other women who directly or indirectly are linked with Mafia.
The first 3 stories and Monica Bedi’s episode are very well written while the other stories are too short.All these stories are real and reveal a totally different side of Mumbai’s underworld. An interesting read, I would say.
Eppudoo chadive, choose maga goondaala gurinchi kaakundaa aada goondaala gurinchi thelsukodam chaalaa baagundi

Wednesday, January 18, 2012
Urban Shots
I picked this short story collection after an exhausted read of Millenium series. Urban shots is a compilation of 28 stories by 13 different authors. The stories revolve around love, friendship, longing, angst and relations is urban life.
Most of the stories are heart-touching and connect with our day-to-day lives. My favourites are ‘The Biggest Problem’, ‘Stick Figures’,'Slow Rain’ and ‘Dialects of Silence’. Few stories are just ordinary and end abruptly without any conclusion.
Over all, it’s a nice read.
Subscribe to:
Posts (Atom)