Thursday, January 19, 2012

బిజినెస్ (బీప్) మేన్




ఇప్పటి తెలుగు సినిమాల్లో హీరోలంటే సకల అవలక్షణాలు ఉన్నవాళ్ళన్న అభిప్రాయం కలుగుతోంది. ఎన్ని చెత్త, తల తిక్క పనులు చేస్తే అంత గొప్పగా చూపిస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక రకంగా అలానే వుంది. ఇక పూరి జగన్నాథ్ గత సినిమాల లాగానే ఇది కూడా మాఫియా - gangsters నేపధ్యంలో నడుస్తుంది. అందులో పెద్ద వింత ఏమీ లేదు కానీ మహేష్ బాబు ఈ సినిమా ఎలా చేసాడా అన్నది నాకిప్పటికీ అర్ధం కాలేదు. ఫ్యామిలీ audience దగ్గర మంచి impression కొట్టేసిన MB  ఇలాంటి సినిమా ఎందుకు చేసాడో. సినిమా అంతా బీప్ లే. ఏమన్నా అంటే మేము బయట ప్రపంచంలో జరిగేదే, మాట్లాడేదే  చూపించాము అంటారు. నిజమే బయట అలానే వుంటున్నారు gangsters , కానీ అలాంటి వాళ్ళని హీరో ని చేసి జనాలకి చూపిస్తే ఎలా అర్ధం చేసుకోవాలి? మనకి అందుబాటులో ఉండి మనల్ని బాగా influence చేసే మాధ్యమాల్లో సినిమా ఒకటి. హీరోలని దేవుళ్ళ లా పూజించే అభిమానులు వున్నారు. సినిమాల ద్వారా మంచిని చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు ని గొప్పగా చూపించడం తప్పు అనిపిస్తుంది నాకు.

ఇక సినిమా లో ఎలాంటి లాజిక్ వుండదు. మనం ఆశించకూడదు కూడా. పాటలు మొదటి మూడు బాగానే వున్నాయి కానీ సెకండ్-హాఫ్ లో వచ్చినవి నాకు నచ్చలేదు. Dialogues కొన్ని బాగున్నాయి. కాజల్ ఏమంత అందంగా లేదు.ఆ మాటకొస్తే నాకు మహేష్ బాబు కూడా అందంగా కనిపించలేదు (దూకుడు లో ఇంకా బాగున్నాడు). ఇందులో రోల్ కి కావాల్సిన లుక్ కోసం అలా కనిపించి ఉంటాడు.

పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మ ని చూసి బాగా inspire అవుతున్నట్టున్నాడు. కానీ ఆయన సినిమాల్లో ఉండే బిగువయిన కధనం (అన్ని సినిమాల్లో కాదు ), artists హావభావాలు (ఒక్క మహేష్ బాబు వి తప్ప ), సన్నివేశాన్ని బాగా elevate చేయగలిగే నేపధ్య సంగీతం ఇవేమీ ఇందులో లేవు. కేవలం సంభాషణలతోనే సినిమా మొత్తం నడిపించాలంటే కష్టం.

సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ చూసి నేను ఇలా ఉంటుందని అస్సలు ఊహించకపోవడం తో కొంచెం ఎక్కువ నిరాశ చెందాను. మహేష్ బాబు ఫాన్స్, అదీ యూత్ కి అయితేనే నచ్చుతుందేమో ఈ సినిమా. నేనయితే 101 డిగ్రీల జ్వరంతో ఈ సినిమాకి వెళ్లాను, మహేష్ బాబు సినిమా అని. ఏ రవి తేజో అయితే కొంచెం digest చేసుకోగలిగే దాన్నేమో కానీ మహేష్ బాబు ని ఇలా చూడలేకపోయాను. సినిమా నచ్చకపోయినా ఎక్కడా బోర్ కొట్టలేదు. అదొక్కటే ఇందులో నాకు కనిపించిన పాజిటివ్ పాయింట్ :)

No comments:

Post a Comment